మా అత్త గారిల్లు అద్భుతంగా ఉంది: సమంత

SMTV Desk 2017-10-22 19:20:28  AKKINENI NAGA CHAITANYA, SAMANTHA,

హైదరాబాద్, అక్టోబర్: నూతన వధూవరులైన అక్కినేని నాగచైతన్య సమంత ల రిసెప్షన్ ఘనంగా చైతూ నివాసంలో జరిగింది. చెన్నైలో చైతూ తల్లి ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్లో అత్తా-కోడలు ఒకే రకమైన దుస్తులు ధరించారు. వీరిద్దరి ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిసెప్షన్‌ ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. విమానంలో సమంత తన భర్త పక్కన కూర్చుని దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎక్కడికైనా తీసుకెళ్లు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ తర్వాత తన అత్తగారింట్లోని వివిధ రకాల బొమ్మలు, చెట్ల కొమ్మల ఫొటోలు తీసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉంది.’ అని పేర్కొంది.