మరోసారి హీరోగా కమెడియన్..!

SMTV Desk 2017-10-20 13:35:13  srinivas reddy, comedian, latest updates

హైదరాబాద్, అక్టోబర్ 20: హాస్య నటుడిగా అందరినీ అలరి౦చిన శ్రీనివాస్ రెడ్డి, మరోసారి ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. హాస్యంతోనే ఆగకుండా ‘గీతాంజలి’ సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు, ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. మళ్ళి హీరోగా అలరించడానికి సిద్దం అవుతున్నారు. ‘రైట్ రైట్’ సినిమా ఫేం సుమంత్ అశ్విన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కి౦చబోతున్నారు. ఈ చిత్రానికి కథానాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి ను ఎంపిక చేశారు. ఇంకా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది.