మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం

SMTV Desk 2017-10-18 12:32:07  Telangana IT Minister KTR, prestigious honor, India, UAE Partnership Conference

హైదరాబాద్, అక్టోబర్ 18 : తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. ఇండియా, యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది. ఈ నెల 30, 31వ తేదీల్లో దుబాయ్ లో జరగనున్న సదస్సుకు హాజరై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. భారత వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపై మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో భారత్, దుబాయ్ కి చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొ౦టారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.