ట్రాన్స్ పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ పై ప్రత్యేక శిక్షణ

SMTV Desk 2017-06-07 15:42:52  driving license transport article central

హైదరాబాద్, జూన్ 7: డ్రైవింగ్ లైసెన్సు జారీలో ఉన్న విద్యార్హత నిబంధనను కేంద్ర రవాణాశాఖ ఎత్తివేయనున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్సుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేనప్పటికీ ట్రాన్స్‌పోర్టు లైసెన్స్‌కు మాత్రం 8వ తరగతి ఉత్తీర్ణత, 20 ఏండ్ల వయస్సుతోపాటు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ తీసుకొని ఒక సంవత్సరం పూర్తికావాలి. ఈ అర్హతలు ఉంటేనే ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ జారీచేస్తారు. దీని కారణంగా పలువురు డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నప్పటికీ విద్యార్హత సర్టిఫికెట్లు లేక ట్రాన్స్‌పోర్టు లైసెన్సు పొందలేకపోతున్నారు. దీంతో డ్రైవింగ్ వచ్చి కూడా లైసెన్స్ పొందలేని వారు ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోయి ఉపాధి అవకాశాలు రోజు రోజుకి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని రాష్ర్టాలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం సవరణ చేసేందుకు అంగీకరించింది. విద్యార్హత నిబంధన స్థానంలో కొత్త షరతు విధించనున్నది. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారు రవాణాశాఖ ఆధ్వర్యంలో మూడునెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందవలసి ఉంటుందని నిబంధన పెట్టనున్నారు.