ఐటీ రంగంలో 10 ప్రత్యేక విధానాలు...కేటీఆర్

SMTV Desk 2017-10-11 14:03:26  KTR, I-Telangana Conference High tech City

హైదరాబాద్, అక్టోబర్ 11 : రోజు రోజుకి పురోగతిని ఇస్తున్న సాంకేతిక రంగానికి అనుగుణంగా నూతన విధానాలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. హైటెక్ సీటిలోని హెచ్ఐసీసీలో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐ-తెలంగాణ సదస్సులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఈవేస్ట్ మేనేజ్‌మెంట్ పై ప్రభుత్వ తెలంగాణ పాలసీని ఆయన ప్రకటించారు. దీంతోపాటు ఇ-వేస్ట్‌ నిర్వహణ విధానాన్ని కూడా విడుదల చేశారు. వచ్చే అయిదేళ్లలో ఐఓటీ రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 50 వేల మందికి నేరుగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది విధాన లక్ష్యం. రెండేళ్ల క్రితం ఐటీ రంగానికి ప్రత్యేక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంలో ఐటీ రంగంలోని ప్రత్యేక విభాగాలకు 10 ప్రత్యేక విధానాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. తాజాగా ఐఓటీ, ఇ-వేస్ట్‌ నిర్వహణలకు విధానాలను ప్రకటించడంతో మొత్తం పది విధానాలను ప్రకటించినట్లయింది. ఐఓటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ప్రోత్సహించేలా ఐఓటీ విధానం ఉందని కేటీఆర్‌ అన్నారు.