ప్లాస్టిక్ రైస్ ని గుర్తించే పద్ధతులు

SMTV Desk 2017-06-07 12:34:39  method of identifying plastic rice, Water test, fire test, fungus,

హైదరాబాద్, జూన్ 7 : ప్లాస్టిక్ రైస్ ని గుర్తించే పద్ధతులు ఇవిగో: 1. వాటర్ టెస్ట్ : ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి. అందులో టేబుల్ స్పూన్ బియ్యం అందులో వేయండి. కొద్దిసేపు కదిలించండి. ఆ తర్వాత నీళ్లలో బియ్యం తేలియాడితే అవి ప్లాస్టిక్ రైస్‌గా గుర్తించొచ్చు. మామూలు బియ్యం నీళ్లలో తేలవు. 2. ఫైర్ టెస్ట్ : చేతి నిండా బియ్యం తీసుకుని... ఆ బియ్యాన్ని లైటర్‌తో వేడి చేయండి. కొద్దిసేపటికి అది ప్లాస్టిక్ వాసన వస్తే అసలు విషయం అర్థమవుతుంది. 3. హాట్ ఆయిల్ టెస్ట్ : కొంత నూనెను బాగా మరిగించండి. సలసలా కాగుతున్న నూనెలో కొన్ని బియ్యం వేయండి. అవి ప్లాస్టిక్ రైస్ అయితే ఆ నూనెలో ముద్దలా మారి పాత్ర అడుగు భాగంలో మిగులుతుంది. 4. ఫంగస్ టెస్ట్ : కొంత రైస్‌ను ఉడికించి... ఓ బాటిల్‌లో వేసి మూడురోజుల పాటు నిల్వ ఉంచండి. బూజు పట్టి, ఫంగస్ చేరితే అవి ప్లాస్టిక్ రైస్ కాదని అర్థం. ఎందుకంటే ప్లాస్టిక్ రైస్ బూజు పట్టవు. 5. బాయిలింగ్ టెస్ట్ : బియ్యాన్ని ఉడికించేటప్పుడు, అది ప్లాస్టిక్ రైస్ అయితే మందపాటి పొర ఏర్పడుతుంది.