'బాల్య వివాహం' ఈ ఆచారం ఎలా వచ్చిందో తెలుసా ?

SMTV Desk 2018-12-03 12:02:27  child marriages, india,history,ramayan

డిసెంబర్ 3 : బాల్య వివాహం చట్ట రీత్యా నేరం ఈ విషయం అందరికి తెలుసు , అయినా ప్రస్తుత సమాజం లో అక్కడక్కడా మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టినా ,వొకప్పుడు మన దేశం లో చాల ఎక్కువగా జరిగేవి . సంఘ సంకర్తల పుణ్యమా అని " ఈ దురాచారం నేరంగా పరిగణించ బడింది , దానికి వ్యతిరేకంగా చట్టాలూ , శిక్షలు కూడా ఉన్నాయి".

భారత దేశ చరిత్ర, అంటే మన ముందున్న గ్రంధాలు " రామాయణ ,మహా భారతాలు " ని ఆదారంగా చూస్కుంటే ఆది నుండి మన దేశం లో ఈ దురాచారాచారం లేదని అర్ధమవుతుంది . అది ఎలా అంటే సీత రాముల కళ్యాణం యుక్త వయసులోనే జరిగింది బాల్య వయసులో కాదు , అలాగే పురాణాల్లో లికించబడిన ఏ కళ్యాణం కూడా బాల్య వివాహం గా చెప్పబడలేదు .

మరి ఈ దురాచారం మనకేల అంటిందని సందేహం రావొచ్చు , పూర్వం మనం దేశం మీదకి ఎందరో పరదేశియులు , భిన్న సంస్కృతు ల వాళ్ళు దాడి చేసి , మన కన్నె పిల్లల పై ధారుణాలకి తెగబడి చెరిచి , చంపేవాళ్లు కొందరిని వారి అవసరాల కోసం ఉంచుకునేవాళ్ళు .

ఇదంతా చూస్తూ నిస్సహాయ స్థితి లో ఉన్న మేధావులు మన ఆడవాళ్ళ అరణ్యరోదనలు విని భరించలేక , ఆ దుండగుల బారినుండి కాపాడటానికి " అష్టవషాద్భవేత్ కన్య " అనే కొత్త సూత్రాన్ని సృష్టించారు . మెడలో తాళి బొట్టుంటే వివాహిత గా పరిగణించ బడి ఆ తుచ్చులు వారి జోలికి రారనే ఉద్దేశం తో ఈ ఆచారాన్ని తీస్కోచ్చారు.

అదండీ విషయం ఆ ఆచారం ఏ కారణంగా మనకి వచ్చినా ... ఇప్పుడున్న సమాజం ప్రకారం అది నేరం, శిక్షార్హం .