వంటింటి చిట్కాలు

SMTV Desk 2019-01-02 14:49:29  Home remidies,

1. మిరపకాయల్ని, జిలకర్రని పొడి చేయాలి అనుకుంటే వాటిని కాసేపు వేయించి తర్వాత కొంతసేపు చల్లార్చి ఆ తర్వాత గ్రైండ్ చేస్తే చాల తొందరగా పొడి అవుతాయి.
2. మీ చేతికి ఇంక్ మరకలు అంటుకుంటే అరటి పండు తొక్కతో చేతికున్న మరకల్ని రుద్దండి. మరకలు వెంటనే మాయం అవుతాయి.
3. షూ పాలిష్ చేస్తున్నప్పుడు అది చేతికి అంటుకుని వదలదు. అలాంటప్పుడు వెస్ లైన్ రాసి బట్ట తో కానీ దూది తో గాని తుడిస్తే చాల తేలికగా పోతుంది.
4. రాత్రిపూట మీ పూలకుండిలపై ఎలుకలు దాడి చేస్తుంటే ఇలా చెయ్యండి. రాత్రిపూట కొన్ని పుదీనా ఆకులను పూలకుండీ చుట్టూ, మరికొన్ని పూలకుండీలోనూ వెయ్యండి. మీ పులా మొక్కలు సురక్షితంగా ఉంటాయి.
5. మీ చేతులకు గ్రీజు అంటుకొని వదలకపోతే వొక చేతిలో కొద్దిగా షేవింగ్ క్రీం వేసుకొని మరొక చేతిలో కొద్దిగా పంచదార వేసుకొని రెండు చేతులు కలిపి రుద్ది కడిగేసుకోండి
6. దుస్తులకు బురద మరకలైతే ఆరనిచ్చి ఎండిన మట్టిని ముందుగా తొలగించండి. ఆ తర్వాత బంగాళాదుంప ముక్కను తీసుకొని బురద మరకపై రుద్దితే మరకన్నా మాటే ఉండదు.
7. కొయ్య ఉపరితలం వున్నా ఏ వస్తువుకైనా మీకు కొట్టడం ఇబ్బందిగా ఉంటే మీకును ముందుగా బార్ సబ్బు లో ముంచాలి.
8. కొన్ని వరాల పాటు నిల్వ ఉంచుకునేందుకు చేసుకునే పచ్చళ్ళు వొక్కొక్కసారి జాడీల్లోనే బూజు పట్టేస్తాయి. అలా జాడీలలో బూజు పట్టకుండా ఉండాలంటే పచ్చడి జాడీలో వేసేముందు, జాడీలోపల అంతా ఉప్పు కలిపిన ఆవనూనె రాయాలి. పచ్చడి కాస్తంత నూనె ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.
9. ఫ్రిడ్జ్ నుంచి తీసిన కోడి గుడ్లను వెంటనే ఉడికించాలి అనుకుంటే ఉడికించే నీటిలో చిటికెడు ఉప్పు, చెంచాడు నూనె వేస్తే గుడ్లు చితికిపోకుండా ఉంటాయి.
10. ఎంత ఖరీదు అయిన నైల్ పాలిష్ అయినా నిల్వ చేయకపోతే గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది.