షుగర్ వ్యాధి కోసం చక్కటి చిట్కా

SMTV Desk 2018-11-29 17:52:16  Shughar, Shughar Desease,

హైదరాబాద్ , నవంబర్ 29: భీకర షుగర్ (మధుమేహ)వ్యాధి సోకిన తరువాత నియంత్రించుకోవడం కంటే ఆ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం చాలా ముఖ్యం. మారిన, మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, లోపించిన దేహ పరిశ్రమ, పౌష్టికాహార లోపం, పర్యావరణంలో కలుగు తున్న మార్పులు, కాలుష్యం - ఇవన్నీ కలిసి మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాయి.

ఈ వ్యాధి కోసం మీకు వొక చక్కటి చిట్కా ని అందిస్తున్నాం

మెంతులు వొక డబ్బా, ముడిపెసలు ఆరుడబ్బులు ఈ నిష్పత్తిలో బాగా కలిపేసి వొక సీసాలో భద్రపరుచుకోండి , పెసలు ,మెంతులు కలిసిన మిశ్రమాన్ని మీకు తగినంతా తీసుకొని నీళ్లలో నానబోయండి . వొకట్రెండు రోజుల్లో చిన్న మొలకలొస్తాయి .మొలకలు వచ్చాక చక్కగా రుబ్బి తగినంత ఉప్పు కలుపుకొని , అల్లం పచ్చిమిరకాయలు వేసుకొని రొట్టెగా చేసుకొని తినండి .
ఇది మధుమేహరోగులకు ఆధ్పూతమైన ఔషధం ,చిక్కిపోతున్న పిల్లలకు పెడితే త్వరగా వొళ్ళుచేస్తారు
వాత వ్యాధులున్నవారికి ,ముక్యంగా పక్షవాతం వ్యాధి వున్నవారికి దీన్ని తప్పనిసరిగా పెట్ట్టండి
బాలింత స్త్రీలకు దీన్ని పెడితే గర్భాశయం త్వరగా సంకోచిస్తుంది దీన్ని రోజు ,ఎప్పటికప్పుడు నానబెట్టుకోంటూ ,మొలకలొచ్చినవి వచ్చినట్లు వాడుకుంటే మంచిది