టాప్ హీరో సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

SMTV Desk 2018-11-30 10:56:19  zero, sharuk khan,bollywood,anushka sharma

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా జీరో అనే సినిమాను రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవల విడుదలయిన టీజర్ కి మంచి పేరు వచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వొక పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ ను ఏర్పాటు చేశారు.
కాగా గురువారం ఈ సెట్ అగ్ని ప్రమాదానికి గురై ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు అదుపులోకి వచ్చాయి కానీ , అప్పటికే చాలా వస్తువులు నాశనమయ్యాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో షారుఖ్ ఖాన్ కూడా అక్కడే ఉన్నారనీ , అయితే ఈ ప్రమాదంలో అయన కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.