గాలిగాళ్ళకి ఓటు వేస్తే గాలిగాళ్లే అవుతారు :కేసీఆర్

SMTV Desk 2018-12-04 17:23:28  KCR

కొడంగల్, డిసెంబర్ 4: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో గాలిగాళ్ళకి ఓటు వేస్తె మనం కూడా గాలిగాళ్ళమే అవుతాం అన్నారు. తెరాస అధికారంలోకి వస్తే తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపిస్తా అన్నారు. మాయమాటలువిని ప్రజలు ప్రలోభపడవద్దు అని సూచించారు.

తెరాస అభ్యర్థుల్ని భారీమెజారిటీతో గెలిపించాలి అని కోరారు. మహాకూటమి రూపంలో తెలంగాణాకి పెద్ద ముప్పు ముంచుకొస్తుంది అది ప్రజలు గమనించాలి అని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో 14 కి 14 సీట్లు గెలుస్తాం అని అన్నారు.