కొత్త అవాన్‌ ఎలక్ర్టిక్‌ వాహనాలు..

SMTV Desk 2019-02-21 21:02:34  Electric vehicle, new launches, Battery technology, avan motors

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ అవన్ మోటార్స్ ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీలో ముందంజలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కొత్త ఒరవడి సృష్టించిన అవాన్‌ మోటార్స్‌ ఈ రంగంలో మరిన్ని నూతన వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2018 సెప్టెంబర్‌లో జెరో ప్లస్‌ను ప్రారంభించిన కంపెనీ ఆ వాహనానికి వచ్చిన స్పందనతో ఆ తరహాలో మరిన్ని ఎలక్ర్టిక్‌ స్కూటర్లు, వాహనాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తుంది.

గతంలో ప్రవేశపెట్టిన జెరో ప్లస్‌ స్కూటర్లకు వినియోగదారుల దగ్గర నుంచి మంచి స్పందన లభించింది. కేవలం ఒక బ్యాటరీతో 60 కిమీ మైలేజ్‌ ఇస్తుండటంతో పాటు దార కూడా రూ.47,000కే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతలని అవాన్‌ మోటార్స్‌ తెలిపింది. కాగా ఈ వాహనం విజయవంతం కావడంతో మరిన్ని ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.