తనిఖీలా తరువాతే మెట్రో ట్రయల్స్...ఆర్‌డీఎస్‌వో బృందం

SMTV Desk 2017-10-10 15:14:35  Metro Projects Trials, Begampeta, Mettuguda, RDSO

హైదరాబాద్,అక్టోబర్ 10 : హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇంతకుముందు కొన్ని మెట్రో రైలు మార్గాలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ప్రస్తుతం బేగంపేట - మెట్టు గూడ మార్గాలలో మెట్రో రైలు ట్రయల్స్ కు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇనస్పెక్టర్(సీఈఐజీ) డీవీఎస్ రాజు... ఎల్అండ్ టీ ఎండీ శివానంద్ ని౦బార్గే, ఎల్అండ్ టీ రైల్వే సిస్టమ్స్ హెడ్ అనిల్ కుమార్ సాయాని, తదితరులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ మార్గంలో నిర్మించిన ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (వోఈటీఎస్) పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గానికి ఉప్పల్ డిపోలోని 220కీవీ/132 కీవీ మెయిన్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ అందించారు. అక్కడి నుంచి మెట్రో మార్గం గుండా ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లనూ డీవీఎస్ రాజు పరిశీలించారు. ఈ నేపధ్యంలో ఆర్‌డీఎస్‌వో బృందం వారు తనిఖీలు చేసి సర్టిఫికేషన్ జారీ చేసిన తరువాతే ట్రయల్స్ నిర్వహించాలని తెలిపారు. విద్యుదీకరణ పనులు సవ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.