నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్‌ పాత్ర : దుల్కర్‌ సల్మాన్‌

SMTV Desk 2017-10-10 08:15:15  dulquer salman, solo, fb post, bijoy nambiyar, rudra character

చెన్నై అక్టోబర్ 10: మలయాళ కథానాయకుడు, ముమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘సోలో’ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. అయితే తమిళ చిత్రాలపై అదనంగా పది శాతం పన్ను విధించడంతో తమిళ సినిమాలు విడుదల కానివ్వమని నడిగర్‌ సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్ల నుంచి సినిమాను తొలగించేశారు. ఈ సంఘటనపై సల్మాన్ స్పందిస్తూ, ‘‘సోలో’ సినిమాని చంపేయకండి. మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. సోలో సినిమాను చూశాను. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగావచ్చింది. నేనేదన్నా సినిమా చేస్తున్నప్పుడు ప్రాణం పెట్టి చేస్తాను. తక్కువ బడ్జెట్‌తో ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు ఎంతో కష్టపడి చేస్తాం. నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్‌ పాత్ర అది. ఇలాంటి పాత్రలను చూసి ఎంజాయ్‌ చేయకుండా తప్పుబట్టడం సహించలేకపోయాను. సినిమాలో ‘రుద్ర’ పాత్ర వివాదాస్పదంగా ఉందని దర్శకుడికి తెలియకుండానే స్టోరీ మార్చేశారు. ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు నాజర్‌, సుహాసిని గారికి కూడా ఇష్టమే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆ పాత్రను తెరకెక్కించారు సినిమా అర్థం కానంత మాత్రాన దాన్ని తక్కువ చేసి చూస్తే అది మా నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను. సోలో సినిమాను చంపేయకండి. మనసు పెట్టి సినిమా చూస్తే అందులో ఉన్న అంతరార్థం మీకు అర్థం అవుతుంది.’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు దుల్కర్‌.