ప్రముఖ సినీ రచయిత కన్నుమూత...

SMTV Desk 2017-10-09 16:01:03  Harinada rao, Speech writer, latest updates

హైదరాబాద్, అక్టోబర్ 9: రక్తబలి, జగన్నాధ రథచక్రాలు, అంతం కానిది, టి. కృష్ణ సినిమాలతో మాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్న హరనాథరావు, అనారోగ్యానికి గురై ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన 150 సినిమాలకు పైగా మాటలు అందించారు. దేశంలో దొంగలు పడ్డారు, ఇదా ప్రపంచం, దేవాలయం, రేపటి పౌరులు, మంచిదొంగ, యుద్ధ భుమి, రాక్షసుడు, రామాయణం, ధర్మచక్రం లాంటి పలు సినిమాలకు మాటలు అందించారు. రాక్షసుడు, స్వయం కృషి వంటి పలు సినిమాల్లో నటించారు కూడా. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు గాను నంది అవార్డులు లభించాయి. సినీ రచయిత హరనాథరావు మృతికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, నిర్మాతలు పోకూరి బాబురావు, మోపర్తి నాగేశ్వరరావు, మన్న౦ వీరయ్య చౌదరి లు సంతాపం తెలిపారు.