మందు బాబులకు శుభవార్త..

SMTV Desk 2017-10-09 12:35:31  Drunken drive case, Modify the terms and conditions, Traffic DCP Ranganath.

హైదరాబాద్, అక్టోబర్ 9 : మద్యం తాగి వాహనాలు నడపడమే కాకుండా కౌన్సెలింగ్ కు హాజరు కాని వారి సంఖ్య మాత్రం వేళల్లో ఉంటోంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చిక్కుకున్న వారి వాహనాలు పోలీస్ స్టేషన్లో కుప్పలుగా పడి ఉన్న క్రమంలో.. వాటి సంరక్షణ మాత్రం పోలీసులకు కత్తిమీద సాములాగా మారింది. ఈ తలనొప్పిని భరించలేని తెలంగాణ ప్రభుత్వం మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొంతమేర కఠిన నిబంధనలను సడలించాలని భావిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం 100 ఎంఎల్ బ్లడ్ లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు బీఏసీ కౌంట్ ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు రంగనాథ్ వెల్లడించారు.