బుల్లితెరపై రుద్రమదేవి..

SMTV Desk 2017-10-08 19:02:06  Rudramadevi, Director Gunashekar, ETV

హైదరాబాద్, అక్టోబర్ 8 : చాలా సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమవుతాయి. 50 రోజుల తరువాత టీవీల్లో ప్రసారమవుతాయి. కానీ దర్శకుడు గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్ గా చెప్పుకున్న రుద్రమదేవి సినిమా మాత్రం.. రెండు స౦వత్సరాల తరువాత ఈ నెల 15వ తేదీన దీపావళి కానుకగా ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమాలో రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. మరి టీవీల్లో ఏ విధంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.