టీపీఈఈవో సంఘం నూతన కార్యవర్గం

SMTV Desk 2017-06-06 19:08:20  president of TPEEO, selected of srinivas

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎస్ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సోమవారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్ ను గౌరవపూర్వకంగా ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి కృష్ణముర్తి తెలిపారు. ఇప్పటి వరకు అధ్యక్షుడుగా కొనసాగిన వేమారెడ్డి ఇటీవల పదవీ విరమణ చేయడంతో అధ్యక్షస్థానం ఖాళీగా ఉండటంతో, ఈ సందర్భంగా నూతన అధ్యక్షుకు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ ఆఫీస్ బేరర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీఈఈవో చీఫ్ అడ్వయిజర్ వేమారెడ్డి, ఉపాధ్యక్షుడు టీ యాదయ్య, కోశాధికారి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.