ఒమర్ నువ్వో శాడిస్టువి.. : అద్నాన్ సమి

SMTV Desk 2017-10-08 12:36:10  Singer Adnan Sami, Jammu and Kashmir Ex. Chief Minister, Omar Abdullah, twitter war.

శ్రీనగర్, అక్టోబర్ 8 : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా "శాడిస్ట్‌" అంటూ ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నోటికొచ్చినట్లు తిట్టేశాడు. అసలు విషయం ఏంటంటే.. శ్రీనగర్ లోని దాల్ లేక్ సమీపంలో అద్నాన్ ఓ కచేరి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కాలేకపోవడంతో సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి ఇది అవమానకరం అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఒమర్ రీట్వీట్ చేస్తూ.. సీట్లు ఖాళీగా ఉంచకుండా ఉండాల్సింది. ఇది నిజంగా బాధాకరం అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అద్నాన్ ఒమర్ ట్వీట్ కు స్పందిస్తూ.. "బ్రదర్.. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. ఈ విషయం గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారంతో ఒక నిర్ణయానికి రావడం సమంజసం కాదు" అన్నాడు. దీనికి ప్రతిగా ఒమర్.. మీ సంగీతం ఒకప్పుడు నాకూ ఇష్టమే. ఈ విషయం గురించి బాధపడడం కూడా తప్పేనా..? అనడంతో కోపోద్రోక్తుడైన అద్నాన్.. "ప్లీజ్ ఒమర్.. ఓ అజ్ఞాత వ్యక్తి పోస్ట్ చేసిన ఫోటోలను, ట్వీట్ లను నువ్వు రీట్వీట్ చేస్తూ మరి శాడిస్టులా ప్రవర్తిస్తున్నావు.. అంటూ ఒకరిమీద ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు.