భాగ్యనగరాన్ని మళ్లీ కుదిపెస్తున్న జోరు వానలు...

SMTV Desk 2017-10-07 18:02:00  Hyderabad, Rains,

హైదరాబాద్, అక్టోబర్ 7: గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం కోలుకోకముందే మళ్లీ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణ౦గా మహానగరాన్ని వర్షాలు కుదిపేస్తున్నాయి. నగరంలో జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కాప్రా, మల్కాజ్ గిరి లో భారీగా వర్షాలు కురుస్తుండగా వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో జన జీవనం స్థంభి౦చిపోయింది. నగరమంతటా 665 చదరపు కిలో మీటర్ల మేర ఈ నెల15 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.