తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కు కొత్త సారధి

SMTV Desk 2017-06-06 17:40:17  Telangana State Housing Corporation,Harishrao,KCR,Bhoomreddy

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూంరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ. హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుందని, పదవులు అనేవి కాస్త ముందూ, వెనుక వస్తుంటాయని తెలిపారు. ఎంతో కాలంగా భూంరెడ్డి పార్టీ కోసం చాలా కష్టపడుతూ తన సేవలను అందిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. సీఎం కేసీఆర్, భూంరెడ్డి లాంటి మంచి వ్యక్తిని గుర్తించి చైర్మన్ గా నియమించడం సంతోషకరమైన విషయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు గృహాలను కట్టాలనే ప్రభుత్వ ఆలోచనను తూచా తప్పకుండా ఆచరిస్తానని, ఇప్పటివరకు ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తానని నూతన చైర్మన్ మడుపు భూంరెడ్డి చెప్పారు.