మళ్లీ దెయ్యం గెటప్‌తో వస్తున్న అంజలి

SMTV Desk 2017-10-06 08:57:41  anjali, balloon, joker, jai, sinish, yuvan shankar raja

హైదరాబాద్ అక్టోబర్ 6: జై, అంజలి, జననీ అయ్యర్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన సినిమా ‘బెలూన్‌’. ఫ్లై హై విత్‌ ఫియర్‌ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. దెయ్యం గెటప్‌లో అంజలి, జోకర్ గెటప్‌లో జై కనిపిస్తున్నారు. పోస్టర్ చూడటానికి ఇంట్రస్టింగ్ గా ఉంది, ఇటీవల హారర్ సినిమాలు తెలుగులో బాగానే ఆడుతున్నాయి మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవ్వనుందో తెలుసుకోవాలంటే మాత్రం కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. ఈ సినిమాను ఎంతో నేర్పుతో దర్శకుడు సినీశ్‌ తెరకెక్కించాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందించిన గీతాలు త్వరలో విడుదల చేస్తారు.