ఖమ్మం లో ఇస్రో శాస్త్రవేత్త

SMTV Desk 2017-06-06 17:24:17  istro, khammam,

రఘునాధపాలెం, జూన్ 6 : ఇస్రో జీఎస్ఎల్ వీ ద్వారా ఉపయోగించిన జీశాట్- 19 విజయం సాధించింది. ఈ విజయంలో ఖమ్మం శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యువ శాస్త్ర వేత్త వల్లూరి ఉమామహేశ్వరరావు సోమవారం ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ ఇలాంటి ఉపగ్రహం ప్రయోగించడానికి గతంలో యురోపియన్ స్పేస్ ఎజెన్సీ సహాయం తీసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ 17 భారత్ శాస్త్ర వేత్తల శ్రమకు ఫలితంగా సొంతంగా ప్రయోగించగలిగామన్నారు. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని ఉపయోగించేందుకు 640 రాకెట్ ను వాడినట్టు చెప్పారు. భారత్ ఈ ఉపగ్రహాన్ని స్వయంగా ప్రయోగించడం ద్వారా వేలకోట్ల దేశ సంపద అద అయ్యిందన్నారు. ఈ ఉపగ్రహం తో దేశ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవల విస్తరణ తో పాటు కమ్యూనికేషన్లు వేగవంతం అవుతాయని ధరలు కూడా అందుబాటులోకి వస్తాయని వివరించారు.