కొత్తగా కొలువైన టీఎన్ జీవో కార్యవర్గం

SMTV Desk 2017-06-06 16:51:44  2020,TNGO,PRTU,Deviprasad,MLC

హైదరాబాద్, జూన్ 6 : రాబోయే మూడు సంవత్సరాల(2020) వరకు పని చేయనున్న టీఎన్ జీవో నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం టీఎన్ జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న కారెం రవీందర్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్లకు మరోసారి అవకాశం ఇచ్చారు. సహా అధ్యక్షులుగా ఉపేందర్ రెడ్డి , కోశాధికారిగా రేచల్, ఉపాధ్యక్షులుగా రాజయ్యగౌడ్, బుచ్చిరెడ్డి, నరేందర్,శ్యాంసుందర్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శైలజాదేవి, కార్యదర్శులుగా నారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, దయా, తిరుమల్ రెడ్డి, మనోహర్, లక్ష్మణరావు , శంకర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీనివాసరావు , ప్రచార కార్యదర్శిగా చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా నరసింహారావు, రాము నాయక్, యాదయ్య, అమృత్ కుమార్, భవానిసింగ్, నర్సయ్య, యాదగిరిరెడ్డి, రవి, నరహరి, కొండల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సుబ్బారావు, రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ అభినందించారు. పీఆర్ టీయూ నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక : తెలంగాణ రాష్ట్ర పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి మే 31 న పదవీ విరమణ పొందిన నేపథ్యంలో నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్న గుర్రం చెన్నకేశవరెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో పీఆర్ టీయూ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి పాల్గొనారు.