వరలక్ష్మి "శక్తి" ఫస్ట్ లుక్..

SMTV Desk 2017-10-05 16:47:09  Varalakshmi Sharath kumar, shakthi movie, Rana daggubati, shiva kaarthikeyan, dulkar salman.

హైదరాబాద్, అక్టోబర్ 5 : తమిళంలో మంచి క్రేజ్ ఉన్న కథానాయికలలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. తమిళంలో ఆమె నటించిన "తారై తప్పట్టై" చిత్రం మంచి ఘన విజయం సాధించి౦ది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల చేయడానికి చిత్రబృంద౦ సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోంది. తెలుగులో విడుదల చేయనున్న ఈ సినిమాకు "శక్తి" అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ కథానాయకుడు "రానా దగ్గుబాటి" తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. తమిళంలో ఈ పోస్టర్ ను శివ కార్తికేయన్ చేతుల మీదుగా విడుదల చేయగా... మలయాళ పోస్టర్ ను దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం.