సుజనా ఫోరంమాల్ పై కేసు నమోదు

SMTV Desk 2017-10-05 13:20:55   Sujana Forumamal, Parking fees, GHMC Act

హైదరాబాద్, అక్టోబర్ 5 : హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఉన్న సుజనా ఫోరంమాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 సెక్షన్‌ 115 (40) ప్రకారం ప్రజావసరాల కోసం వాడే భవనాలను పబ్లిక్ ప్లేసులుగా పరిగణించి.. 44 శాతం పార్కింగ్‌ స్థలం కేటాయించాలని ఉంది. అలాగే రెసిడెన్షియల్‌ సముదాయాల్లో పార్కింగ్‌ ఫీజు వసూళ్లు చేసేందుకు అనుమతి లేదు. కాని అపార్ట్ మెంట్ యాక్ట్ 1978 ప్రకారం.. నిబంధనలకు విరుద్దంగా సందర్శకుల నుండి సుజనా మాల్ నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన సుజనా ఫోరం మాల్‌కు రాగా, గంటన్నరపాటు పార్కింగ్‌లో కారును నిలిపినందుకు రూ.30 వసూలు చేశారని ఆరోపించారు. దీంతో ఆ మాల్ పై ఐపీసీ సెక్షన్‌ 188, 418, 420కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.