బోనాల జాతర తేదీ ఖరారు

SMTV Desk 2017-06-06 15:58:33  talasani srinivas yadav, telangana

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించాడనికి అన్ని ఏర్పాట్లు చేయలని పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఈ నెల 25 న బోనాల జాతర ప్రారంభ ఉత్సవంలో ఎలాంటి నిర్వహణ పరమైన లోపాలు లేకుండా చెయ్యాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఆషాడమాసంలో బోనాల జాతర ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత అనుభవాలను దృషిలో ఉంచుకొని ఈ సారి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 25 న లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు తోట్టెల ఊరేగింపు ఉంటుందన్నారు. తోట్టెల ఊరేగింపు రోజున అమ్మవారికి పట్టువస్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. భారీ విధ్యుత్ దీపాలు ఏర్పాటు చేసి అలాగే ఆలయం ఆవరణలో రెండు మెడికల్ క్యాంప్, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.