‘గరుడవేగ’ చిత్రంలో సన్నీ లియోన్

SMTV Desk 2017-10-04 07:37:34  rajashekar, garudavega, sunnyleone, praveen sattaru, shraddha das

హైదరాబాద్ అక్టోబర్ 4: రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన ‘గరుడవేగ’ చిత్ర టిజర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర టిజర్ లో రాజశేకర్ లుక్ కూడా చాల బాగుందని నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ మేరవనున్నదని చిత్ర యూనిట్ తెలియజేసారు. ఈ చిత్రాన్ని ఎం.కోటేశ్వరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఉగ్రవాదాన్ని ఏరిపారేసే పాత్రలో రాజశేఖర్‌ కనిపిస్తారు. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం అందరిని ఆకట్టుకుంటుందని, సన్నీ లియోనిపై తెరకెక్కించిన ‘డియో డియో’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భీమ్స్‌ స్వరపరిచిన ఈ గీతానికి విష్ణు వేద నృత్యాలు అందించారు. ఈనెలాఖరున గానీ, నవంబరు మొదటివారంలోగానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు. పూజా కుమార్‌, శ్రద్దాదాస్‌ కథానాయికలు, ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.