నటుడు దిలీప్ కు కాస్త ఊరట..

SMTV Desk 2017-10-03 18:31:10  Actress Bavana, Actor Dileep, Dileep gets bail in sexual Assault Case.

కేరళ, అక్టోబర్ 3 : మలయాళ నటి భావనను కిడ్నాప్ చేయడమే కాకుండా ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు కాస్త ఊరట లభించింది. జూలై 10న అరెస్టైన దిలీప్ ఇప్పటివరకు ఐదు సార్లు బెయిల్ కోసం అర్జీ పెట్టుకోగా, తాజాగా కేరళ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దిలీప్ గతంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌లను విచారించిన కోర్టు.. ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలన్ని తారుమారు కావ‌డం, ఆధారాల ట్యాంప‌రింగ్ వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ఇప్పటివరకు ఆయనకు బెయిల్ మంజూరు చేయ‌లేదు. దాదాపు 85 రోజుల తర్వాత ఎట్టకేలకు దిలీప్ బెయిల్ మీద బ‌య‌ట‌కు రానున్నారు.