సినీ నటుడు మోహన్ బాబుకు గౌరవ డాక్టరేట్

SMTV Desk 2017-10-03 16:38:27  Mohan Babu, the famous actor, Chennai, MGR University, Honorary Doctorate

హైదరాబాద్, అక్టోబర్ 03 : ప్రముఖ నటుడు విద్యావేత్త మోహన్ బాబుకు చెన్నై, ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ నెల 4న చెన్నైలో డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు ఎంజీఆర్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 500 చిత్రాలకు పైన నటించిన మోహన్ బాబును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించగా, ఇటీవలే అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. బ్రిటన్ లోని ఏషియన్ లైట్ భారతీయ వార్త పత్రిక, ప్రణమ్ పురస్కారంతో సన్మానించింది. తాజాగా ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రకటించడం పట్ల మోహన్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.