‘కంగనా’ ఈ సారి.. హీరోలపై కామెంట్ చేసింది

SMTV Desk 2017-09-27 08:46:40  spyder,

హైదరాబాద్ సెప్టెంబర్ 27: ఎప్పుడు వార్తల్లో నిలిచే బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘కంగనా రానోత్’ ఈ సారి మళ్లీ బాలీవుడ్ హీరోలపై కామెంట్ చేసింది. ఆ మధ్య ‘ఆప్ కా అదాలత్’ కార్యక్రమం లో పాల్గొని బాలీవుడ్ ప్రముఖుల అందరికి చెమటలు పట్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కంగనా సినీరంగం లోని పెద్ద స్టార్ ల గురించి మాట్లాడుతూ... ‘సినీరంగంలో హీరోలు పదిహేను సంవత్సరాల అమ్మాయితో గంతులేస్తుంటారు. కానీ, తమ కూతుళ్ళు బికినీలు వేస్తే కాళ్ళు విరగ్గొడతామని వార్నింగులు ఇస్తుంటారు’అని పరోక్షంగా షారూఖ్‌ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. “తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కానీ కూతుళ్ళను హీరోయిన్లుగా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు. అయితే అందరూ హీరోలు అలా లేరు” అని ముక్తాయింపు ఇచ్చింది.