తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్ ఖాన్

SMTV Desk 2017-09-26 17:44:02  Salman Khan, Sarogasi, Shahrukh Khan, Aamir Khan.

ముంబై, సెప్టెంబర్ 26 : బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ త్వరలో తండ్రి కానున్నట్లు సమాచారం. అదేంటి పెళ్లి కాకుండా ఎలా తండ్రి కాబోతున్నారనే కదా.! మీ అనుమానం. అదేనండీ.. "సరోగసి" (అద్దెగర్భ౦) పద్ధతిలో తండ్రి అయ్యే ఆలోచనలలో సల్మాన్ ఉన్నట్లు బాలీవుడ్ గుసగుసలాడుతోంది. ప్రస్తుతం సల్మాన్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రెండేళ్ళ పాటు ఆగుతున్నాడని బాలీవుడ్ వర్గాలలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే సరోగసిని ఆశ్రయించిన వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్, దర్శకురాలు ఫరాఖాన్ లు ఉన్నారు.