మహాభారతం తీయడం ఒక కల : రాజమౌళి

SMTV Desk 2017-09-25 16:29:22  Director S.S. Rajamauli, Mahabharata movie, Vijayendra prasad

హైదరాబాద్, సెప్టెంబర్ 25 : దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించనున్నారని గతంలో ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజమౌళి ఈ విషయం గురించి మాట్లాడుతూ... "మహాభారతం సినిమా తీయడం ఒక కల అనే చెప్పాలి. ప్రస్తుతానికి నేను "బాహుబలి 2" విజయాన్ని ఆస్వాదిస్తున్నా... ఇప్పటికైతే ఇంకా ఏ సినిమాను మొదలుపెట్టలేదు" అని స్పష్టం చేసారు. బాహుబలి లాంటి సినిమానే అంత గొప్పగా తీసిన ఆయన.. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని ఎలా తీయనున్నారో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ప్రస్తుతానికి నిరాశే ఎదురైందని చెప్పాలి.