‘స్పైడర్‌’ సినిమా ఈ సన్నివేశంతోనే మొదలు..

SMTV Desk 2017-09-25 08:01:15  mahesh babu, rakul preeth sing, ar murugadas, sj surya, spyder

హైదరాబాద్ సెప్టెంబర్ 25: తాజాగా ‘స్పైడర్‌’ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ విడుదలైంది. నెట్టింట్లో ఈ పోస్టర్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ పోస్టర్ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటంటే ఆ పోస్టర్లో ఉండే సన్నివేశంతోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. సినిమా ఓపెన్ చేయగానే మహేష్, ఎస్.జె.సూర్య పోస్టర్ లో ఉన్నట్టు కూర్చోని కనిపిస్తారట. వాళ్ళిద్దరూ మధ్య సంబాషణల ద్వారానే ఈ చిత్రం కథ మొదలవబోతుందట. మొదటగా ప్రతినాయకుడి మాటలతో మొదలై, అలాగే నాయకానాయికల మధ్య ప్రేమ గురించి మాత్రం మధ్య మధ్యలో హీరో మాటల్లో వినొచ్చట.. ఆసక్తికరంగా ఉంది కదూ. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయట. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బోలెడు ఉన్నాయి. మరి అంచనాలను దాటి విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.ఈ సినిమాకు ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే హారిశ్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 27న ‘స్పైడర్‌’ థియేటర్ల లోకి వస్తున్నాడు.