తెందుల్కర్‌ కుమార్తె సినీరంగ ప్రవేశం..

SMTV Desk 2017-09-24 15:30:05   Sachin Tandulkar, Sara Tandulkar, Amirkhan, bollywood.

ముంబై, సెప్టెంబర్ 24 : క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కుమార్తె "సారా" త్వరలో సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఆమెను ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ పరిచయం చేయనుండడం విశేషం. అయితే సారా చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలని కలలు కనేదట.. దానికి ఇదే అనువైన సమయం అని భావించిన అమీర్ ఆమెను చిత్ర పరిశ్రమకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తొలి సినిమాతోనే అగ్ర కథానాయకుల సరసన నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సారా.. ఆమె తల్లిదండ్రులతో కలిసి పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది.