అక్క అంజలి స్ఫూర్తి తోనే సినీరంగంలోకి వస్తున్నా: ఆరాధ్య

SMTV Desk 2017-09-24 07:31:59  anajali, anjali sister, aradya, svsc, samudra

చెన్నై సెప్టెంబర్ 24: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి, ఇపుడు తన చెల్లెలు ‘ఆరాధ్య’ కూడా వెండితెర పైకి పరిచయం కాబోతున్నదని, ఈ విషయాన్నీ ఆరాధ్యే స్వయంగా వెల్లడించింది. తన గ్లామర్ చూసి సినిమాల్లోకి వెళ్ళమంటూ స్నేహితులు పదేపదే చెబుతూ ఉండటంతో, తనలోను ఆసక్తి కలిగిందని అలాగే అక్క అంజలి స్ఫూర్తి తోనే ఈ రంగంలోకి వస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమిళం లో సముద్ర దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నానని, తెలుగులోనూ ఒక సినిమాకి ఓకే చెప్పానని అంది. కథానాయిక ల సిస్టర్స్ చాలామంది సినీరంగ ప్రవేశము చేసారు, కానీ చాల మంది సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. మరి ఈ అమ్మడు ఎంతవరకు తన కెరీర్ ను నిలబెట్టుకుంటుందో చూడాలి మరి.