ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు చూసేసా:

SMTV Desk 2017-09-22 09:28:57  prabhas, saaho, shraddha kapoor, baahubali

హైదరాబాద్ సెప్టెంబర్ 22: ఈశ్వర్ చిత్రం తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రభాస్ అంచలంచలుగా ఎదుగుతూ ఈ రోజు నేషనల్ వైడ్ గా పెద్ద స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధ కపూర్ కలిసి జంట గా నటిస్తున్న చిత్రం ‘సాహో’. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ గురించి ఆసక్తిగా వివరిస్తుంది. ఇపుడు ప్రభాస్ కు కొత్త బిరుదు కూడా ఇచ్చింది ఈ భామ. సాహో సమయంలో సినిమా యూనిట్ తో మాట్లాడుతూ, ప్రభాస్ ఎలా నటిస్తాడో తెలుసుకోవాలని, ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు చూసేసానని చెప్పింది.. ప్రభాస్ ను అంతా యంగ్ రెబల్ స్టార్ అంటారని, కానీ ప్రభాస్ ను అలా కాకుండా ‘ద న్యూ బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌’ అని పేర్కొంది.