మళ్లీ భారీ యాక్షన్ సీన్స్ తో వస్తున్న బెల్లం కొండ శ్రీనివాస్

SMTV Desk 2017-09-20 22:13:43  belamkonda srinivas, jaya janaki nayaka, srivas, kagapatobabu, puja hegde, sharath kumar

హైదరాబాద్ సెప్టెంబర్ 20: ఈ మధ్య ‘జయ జానకి నాయక’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాతి చిత్రం డిక్టేటర్ ఫేం శ్రీవాస్ దర్శకుడితో చేస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్ మరియు మీనా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయంట. మాస్ హీరోగా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకుందామని అనుకుంటున్నాడేమో, అందుకే అన్ని మాస్ సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. ఇటీవలే పొల్లాచ్చిలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ కోసం కాశికి చేరుకుంది. ఈ షెడ్యూల్ తో సినిమా చాల వరకు కంప్లీట్ అయిందని సమాచారం. ఈ నేపథ్యంలో దిగిన సెల్ఫీని బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.