కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రానా

SMTV Desk 2017-09-15 17:57:45  rana daggupati, nene raju nenu mantri movie, tamil version, naan aanaiyittal movie

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ నటించిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. వైవిధ్యభరితమైన కథతో పాటు సినిమాలో కొత్తదనం ఉన్న కారణంగా ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమాను మొదట తెలుగుతో పాటే తమిళంలోనూ విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు తమిళ వెర్షన్ సినిమాను ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి "నాన్ ఆనైయిట్టాల్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. రానాకు తెలుగుతో పాటే తమిళంలోనూ మంచి క్రేజ్ ఉండడం వల్ల ఈ సినిమా కోలీవుడ్ లో కూడా ఘన విజయం సాధిస్తుందని సినీ నిర్మాణ సంస్థ అంచనా వేస్తున్నారు.