మ్యాజిక్ ఫిగర్ తో అధికారం కాయం అంటున్న కేసీఆర్

SMTV Desk 2017-05-28 11:32:52  congress,TRS,CM,KCR,BJP,

హైదరాబాద్, మే 26 : ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మ్యాజిక్ ఫిగర్ తో అధికారం తిరిగి కైవసం చేసుకోవడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ శాసన సభ పక్ష సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తాను చేయించిన సర్వే వివరాలను ప్రకటించారు. 111 స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ..మిగతా పార్టీలన్నీ నామరూపాల్లేకుండా పోతాయని తన సర్వే ద్వారా వెల్లడయినట్లు స్పష్టం చేశారు. ఎంఐఎం మాత్రమే నిలదొక్కుకుంటుందని, టిడిపి, బిజెపిలకు ఒక్కసీటు కూడా దక్కదని, ఇక కాంగ్రెస్ కు రెండు సీట్లు మధీర నుండి జీవన్ రెడ్డి తో పాటు కల్వకుర్తి సీట్లను కాంగ్రెస్ గెలుపొందుతుందని వివరించారు. సిట్టింగులందరికి వచ్చేఎన్నికల్లో టికెట్లు ఖాయమని...ఎన్నికల ఖర్చుపై ఎలాంటి భయం వద్దని..ఎన్నికల ఖర్చు పార్టీయే భరిస్తుందని ప్రకటించారు. గతం కంటే రెండింతలు మెరుగైన రీతిలో సభ్యత్వ నమోదు జరిగిందని వెల్లడించారు. ఇక సర్వే వివరాల్లోకి వెళ్తే గజ్వేల్ నుండి కేసిఆర్ కు అత్యధిక శాతం మార్కులు లభించాయి. 98 శాతం ఆయనకు దక్కగా కేటిఆర్ కు 91 శాతం, హరిష్ రావుకు 88 శాతం శాసన సభ్యులందరికి శాతాల వారిగా పనితనం వివరాలను వెల్లడించారు. తక్కువ పనితీరును కనబర్చిన వారు తమ పనితీరును మెరుగుపర్చుకునేందుకు ఇప్పటి నుండి కష్టపడాల్సిందిగా సూచించారు. జూలైలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం కొసమెరుపు.