ఉంగరాల రాంబాబు... రివ్యూ

SMTV Desk 2017-09-15 16:25:36  ungarala rambabu, telugu movie, sunil new movie, sunil movies

హైదరాబాద్ సెప్టెంబర్ 15: తెలుగు సినీ పరిశ్రమలో మొదట చిన్న కమీడియన్ రోల్స్ చేసుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమీడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ కు సినిమాలో హీరోగా అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించిన సునీల్ అందాల రాముడు సినిమాలో హీరోగా చేయడంతో, ఆ తర్వాత జక్కన్న దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక కామెడీ రోల్స్ కు స్వస్తి చెప్పి హీరోగా కొనదాగుదామని డిసైడ్ అయ్యి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘ఉంగరాల రాంబాబు’ సిద్ధమయ్యాడు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. క‌ష్టం తెలియ‌కుండా పెరిగిన కుర్రాడు రాంబాబు (సునీల్‌). 200 కోట్ల ఆస్తికి వార‌సుడు. త‌న తాత చనిపోయాక ఆ ఆస్తుల‌న్నీ దూర‌మ‌వుతాయి. వ‌ట్టి చేతుల్తో రోడ్డుపైకి వ‌చ్చాక రాంబాబుకి బాదం బాబా (పోసాని కృష్ణ‌ముర‌ళి) ఆశ్ర‌మం క‌నిపిస్తుంది. దొంగ బాబా అయిన బాదం బాబా చెప్పిన స‌ల‌హాతో రాంబాబుకు మంచే జ‌రుగుతుంది. తాను పోగొట్టుకున్న ఆస్థి మొత్తం తిరిగొచ్చేస్తుంది. అయితే అనుకోకుండా రాంబాబు జీవితంలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనుకోకుండా తనకు నష్టాలు ఎదురవ్వడంతో దీనికి పరిష్కారంగా బాదం బాబా సలహా తీసుకోగా తనకు అదృష్టం తెచ్చే అమ్మాయిని చూసి పెళ్లిచేసుకో అంటాడు. ఈ క్రమంలో తన ఆఫీస్ లో మేనేజర్ గా చేరిన సావిత్రి (మియా జార్జ్)ను చూసి ఇష్టపడతాడు రాంబాబు. ఆమె కూడా ముందు నిరాకరించినా ఫైనల్ గా రాంబాబుకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్.. ఆమె ఒప్పుకున్నా సావిత్రి తండ్రి రంగ (ప్రకాశ్ రాజ్) ఒప్పుకోడు. రైతుల భూమి కోసం పోరాడే రంగ మనసు గెలుచుకునేందుకు రాంబాబు ఏం చేశాడు..? చివరకు రంగ రాంబాబు ప్రేమను ఒప్పుకున్నాడా.. లేడా అన్నది తెర మీద చూడాల్సిందే. ముందుగా న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే, సునీల్ పెర్ఫామెన్స్ ప‌రంగా ఆక్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. డ్యాన్సులు బాగా చేశాడు. మియాజార్జ్ పెర్ఫామెన్స్‌కు స్కోప్‌లేని, పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే పాత్ర‌లో క‌నిపించింది. ఇక ఫ‌స్టాఫ్‌లో బాదం బాబాగా పోసాని కాసేపు న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు. జాత‌కాల‌పై పిచ్చి ఉన్న క‌థానాయ‌కుడి పాత్రంటే హాస్యం పండించ‌డానికి చాలా ఆస్కారం ఉంటుంది. స‌న్నివేశాలు ఆ దిశ‌గానే వెళుతున్నాయ‌నిపించేలోపే ద‌ర్శ‌కుడు క‌థ‌ని విమానంలోకి ఎక్కించి దుబాయ్‌కి తీసుకెళ్లాడు. అక్క‌డే సినిమా కాస్త గాడి త‌ప్పిన‌ట్లైంది. సినిమాలో ప్రకాశ్ రాజ్ లాంటి గొప్ప నటుడు ఉన్నా ఆయన్ను వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. ఇక సినిమా అంతా రొటీన్ గా నడిపించాడని అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్ అంటూ వచ్చే కామెడీ కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. సునీల్ టైమింగ్ అక్కడక్కడ బాగానే నవ్వులు తెప్పిస్తుంది. అయితే ఇదే తరహా కథలు చాలా వచ్చాయి కాబట్టి పెద్ద గా ఆడియెన్స్ త్రిల్ ఫీలయ్యే అవకాశం ఉండదు. ఇక జిబ్రాన్ సంగీతం గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత త‌క్క‌ువ. ఒక ట్యూన్ కూడా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స‌రేస‌రి. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ఫరావాలేదు. ఉంగ‌రాల రాంబాబు చిత్రంలో మొత్తంగా చూస్తే కొత్త‌గా చెప్ప‌దేం ఉండ‌దు.