స్పైడర్ సినిమాలోని ఇంకో సాంగ్ విడుదలయ్యింది

SMTV Desk 2017-09-14 23:27:04  mahesh babu, spyder, rakul preeth sing, murugadas, harris jayraj

హైదరాబాద్ సెప్టెంబర్ 14: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రీసెంట్ గా చెన్నై లో నిర్వహించారు. ఈ శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకలవేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వార ఒక పోస్ట్ చేసారు... తన అభిమానులకు, మ్యూజిక్ ప్రేమికులకు ఈ రోజు 9 గంటలకు స్పెషల్ స‌ర్‌ప్రైజ్ ఇస్తానని పోస్ట్ చేసారు. అనుకున్నట్టుగానే మహేష్ తన ట్విట్టర్ ఖాతా నుండి ఒక పాటని విడుదల చేసి స‌ర్‌ప్రైజ్ చేసారు. ఈ పాటని గీత మాధురి పాడింది. మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ ఇది, ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి మరి. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హర్రిస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక, ఎస్. జే. సూర్య విలన్ పాత్రలో నటించారు. .