యాంకర్ సుమ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా..!.

SMTV Desk 2017-09-14 15:56:36  suma kanakala, jimmy kimmel song, velipandinte pusthakam,

హైదరాబాద్, సెప్టెంబర్ 14: బుల్లితెర పైన టి.వి. షోలను హోస్ట్ చేస్తున్న యాంకర్‌ స్టార్ మహిళ సుమ కనకాల అలవోకగా మాట్లాడడమే కాకుండా వెండితెర కు సింగర్ గా పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు తను డ్యాన్స్ కూడా చేయగలదని నిరూపించుకుంది. తాజాగా ఈ మలయాళీ కుట్టి ఓ మలయాళీ పాటకు తన ఇంట్లో డ్యాన్స్ చేసి, ఈ పాట నన్ను ఉర్రూతలూగిస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి౦ది. ఎంటా మలయాళీ పాట అని ఆలోచిస్తున్నార..! ఇటీవల విడుదలైన ‘వెలిపడింతె పుస్తకం’ సినిమాలోని ‘జిమ్మిక్కి కమ్మల్‌’ పాటకు సుమ డ్యాన్స్‌ చేశారు. ఈ పాటను మెచ్చుకుంటూ ప్రముఖ అమెరికన్‌ టీవీ హోస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ఈ వీడియో ను 14 లక్షల మందికి వీక్షించగా, చాలా మంది ఈ పాటకు పేరడీలు చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు.