ఇష్టమైన హీరో విజయ్ : శాలిని పాండే

SMTV Desk 2017-09-13 23:18:14  shalini pandey, vijay devarakonda, mahanati,

హైదరాబాద్ సెప్టెంబర్ 13: అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండేకి మొదటి సినిమాకే చాలా క్రేజ్ వచ్చింది. ఇపుడు ఏకంగా షాపింగ్ మాల్స్ ను ఓపెన్ చేయడానికి పిలుస్తున్నారు. అయితే రీసెంట్ గా నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన షాలిని అస్వస్థతకు గురవడంతో, ఓ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో మాట్లాడింది. ఈ సందర్బంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ, తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. తన తరువాతి చేయబోయే సినిమాల గురించి చెప్పింది, మహానటి లో నటిస్తున్నానని అయితే పాత్ర గురించి ఇపుడే చెప్పనని చెప్పింది. ఇంకా 100% లవ్ రీమేక్ లో నటిస్తున్నాని చెప్పుకోచ్చింది.