రాహుల్ కు రిషి కపూర్ సెటైర్

SMTV Desk 2017-09-13 12:19:15  rishi kapoor, commented rahul gandhi boliwood

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 13: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ సెటైర్‌ వేశారు. రాహుల్ నిన్న కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ గురించి ప్రస్తావించారు. రాహుల్‌ కామెంట్లపై స్పందించిన రిషి వరుస ట్వీట్లు చేశారు. ‘రాహుల్‌.. 106 ఏళ్ల భారతీయ చిత్ర పరిశ్రమలో కపూర్ల కుటుంబానికి 90 ఏళ్లుగా భాగస్వామ్యం ఉంది. ఆత్మీయ అనురాగాలు ఉన్నాయి. మాలోంచి ఒక్కో నటుడిని ప్రేక్షకులే ఎంచుకున్నారు. దేవుడి దయవల్ల మా కపూర్‌ కుటుంబంలో నాలుగు తరాలు సినిమా పరిశ్రమలో ఉన్నాయి. కాబట్టి వారసత్వ రాజకీయాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడకు. శ్రమతో ప్రజల గౌరవాన్ని, ప్రేమను పొందాలి, వారసత్వంతో కాదు అంటూ చురకలంటించారు రిషి.