కత్తి మహేష్ వ్యాఖ్యలపై స్పందించిన మరో హీరో...

SMTV Desk 2017-09-12 18:39:24  kathi mahesh, burning star sampoornesh babu, pavan kalyan

హైదరాబాద్, సెప్టెంబర్ 12: గత కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారిన పవన్ కళ్యాణ్ పట్ల కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఓ హీరో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కత్తి మహేష్ వాదనలపై తీవ్రంగా స్పందించాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిధంగా మాట్లాడడం చాలా బాధగా అనిపించిదని ఆయన పేర్కొన్నారు. "మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది .. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలి. ఒక విషయంపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు .. కానీ అలా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే .. ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని" అడిగాడు.