సినీ పరిశ్రమంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలంటే..?

SMTV Desk 2017-09-12 16:38:35  MAGALIR MATTUM, TAMIL MOVIE, HEROINE JYOTHIKA, DOCUMENTARY FILMMAKER, DIRECTER BRAMHA, BHANUPRIYA, URAVASHI,

చెన్నై, సెప్టెంబర్ 12 : లేడి ఓరియె౦టెడ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ ప్రముఖ నటి జ్యోతిక అన్నారు. బ్రహ్మ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం "మగలిర్‌ మట్టుం"(ఆడవారికి మాత్రమే) చిత్రంలో జ్యోతిక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జ్యోతిక భర్త, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరిస్తు౦డడం విశేషం. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా జ్యోతిక తన అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకుడు బ్రహ్మ ఈ చిత్ర కథతో నా దగ్గరికి వచ్చి వినిపించినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇలాంటి కథను ఎప్పుడు ఎవరు తీయలేదు. ఈ కథను ఓ పురుషుడు సిద్దం చేయడం చాలా సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ చిత్ర పరిశ్రమ పురుషాధిక్య పరిశ్రమ. కేవలం కథానాయికా ప్రాధాన్యమున్న సినిమా ఇక్కడ వసూళ్ళు రాబట్టడం అనేది సవాళ్లతో కూడుకున్న పని. ఒక హీరో నటించిన సినిమా అయితే నాలుగైదు రోజు హౌస్ ఫుల్ తో నడుస్తోంది, అదే హీరోయిన్ ఓరియె౦టెడ్ మూవీలో నటిస్తే ఆ సినిమాను వారాంతంలోనే తీసేస్తారని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో భానుప్రియ, ఊర్వశి, శరణ్య పొన్వన్నన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.