సినిమా కథని తలపించిన పరువు హత్య

SMTV Desk 2017-05-28 11:07:58  lovers murder,nalgonda,bhuvanagiri,naresh marder,swath suside,mahesh bhagavath,rachakonda comisioner

నల్గొండ, మే 26 : నల్గొండ జిల్లా భువనగిరిలో పరువు హత్యకు పాల్పడి సినిమా కథలనే మరిపించేలా దారుణానికి ఒడిగట్టారు. భార్య ముందే భర్తను నరికి చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే స్పష్టంగా వెల్లడించనప్పటికి ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు పోలిసులు ప్రకటించారు. రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలిస్ మహేష్ భగవత్ సైతం ఇటువంటి కేసు తన సర్వీసులోనే కనివిని ఎరుగనని వెల్లడించడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ప్రేమ పెళ్ళి చేసుకున్నారనే అక్రోషంతో విచక్షణను మరిచిన స్వాతి తండ్రి అల్లుడైన నరేష్ ను హత్య చేసినట్లుగా పోలిసులు వెల్లడించారు. అయితే రాడ్ తీసుకోని నరేష్ పై విచక్షణా రహితంగా దాడి చేయడంతోనే మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక మరో విషయానికోస్తే స్వాతి, ఓసారి ఆత్మహత్య యత్నం నుండి బయటపడగా రెండోసారి ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా కులం, మతం అంటూ పట్టింపులకు పోయి తమ సంతానం ఆనందాన్ని ఆవిరి చేయడం ఎంతమాత్రం తగదని అనుభవజ్ఞులు, స్వచ్చంద సంస్థల వారు సూచిస్తున్నారు.