ప్రముఖ సీనీ నటి బి.వి. రాధ కన్నుమూత

SMTV Desk 2017-09-10 14:50:29  Senior Kannada Actress, Producer BV Radha Dies in bangalore

బెంగుళూరు, సెప్టెంబర్ 10 : ప్రముఖ కన్నడ సీనియర్‌ నటి బి.వి. రాధ(70) కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దక్షిణాదిలో దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆమె ప్రేక్షకులను అలరించారు. 1964లో నవకోటి నారాయణ అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి నటించిన ఆమె, పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాధ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న ఆత్మీయులు సంతాపం తెలిపారు.