కొత్త దనం కోసం దగ్గుబాటి రానా తపన

SMTV Desk 2017-09-08 16:46:47  daggu bati rana, rana new movie, rana tollywood, tollywood news

హైదరాబాద్ సెప్టెంబర్-08 నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత రానా దూసుకుపోతున్నారు. ప్రతి సినిమా లోను కొత్త దనం కోసం తపన పడుతున్నారు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో బాహుబలి సినిమాతో విలన్ గా జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా త్వరలో గుణశేఖర్ తెరకెక్కించబోయే హిరణ్య కశ్యపలోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రానా మరో పౌరాణిక చిత్రంలో నటించనున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో రావణ అనే పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు చాలా కాలం క్రితమే పనులు ప్రారంభించారు. మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించనున్న ఈ సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.